CM KADAPA TOUR: సీఎం జగన్ ఈ నెల 23న కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరు, కొప్పర్తి మండలాలతోపాటు గోపవరం మండలంలోని ప్రాజెక్టు కాలనీలో పర్యటించనున్నారు. సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ ఏర్పాటుకు 482 ఎకరాల భూములను ఇచ్చిన రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం రూ.956 కోట్లతో సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
CM KADAPA TOUR: కడప జిల్లాలో సీఎం టూర్.. కొనసాగుతున్న ఏర్పాట్లు - cm jagan kadapa tour
CM KADAPA TOUR: కడప జిల్లాలో ఈ నెల 23న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
కడప జిల్లాలో సీఎం పర్యటన
ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల 2,266 మందికి ఉపాధి లభించనుండగా.. పరోక్షంగా మరో 10 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల బద్వేల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీచదవండి: