CM Jagan Kadapa Tour: ముఖ్యమంత్రి జగన్ గురువారం నుంచి మూడు రోజులపాటు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి.. 3 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ గ్రామ సచివాలయ సముదాయాన్ని ప్రారంభిస్తారు. అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్లో ఇడుపులపాయ వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు.
రేపటి నుంచి పులివెందులలో సీఎం జగన్ పర్యటన - పులివెందుల
CM Jagan Tour in Kadapa: కడప జిల్లాలో రేపటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వేల్పుల గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. వైఎస్ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి
సెప్టెంబరు 2వ తేదీ ఉదయం వైఎస్ వర్దంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాళులు అర్పించనున్నారు. ఇడుపులపాయ చర్చి ఆడిటోరియంలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా అధికారులు, నాయకులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి ఇడుపులపాయలో బస చేసి.. 3వ తేదీ ఉదయం తాడేపల్లికి తిరిగివస్తారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
ఇవీ చదవండి: