ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపాకు అనుకూల ప్రాంతాల్లోనే ఈవీఎంల సమస్య' - tdp adhi

తెదేపాకు అనుకూల ప్రాంతాల్లోనే ఈవీఎంలు పాడయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా 125 స్థానాల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం

By

Published : Apr 12, 2019, 2:54 PM IST

రాష్ట్రంలో నిన్న జరిగిన పోలింగ్‌లో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు. కడప జిల్లా పోట్లదుర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన... తెదేపాకు అనుకూలమైన ప్రాంతాల్లోనే ఈవీఎంల సమస్య రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పోలింగ్ శాతం తగ్గించడానికి వైకాపా రాజకీయాలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 125 అసెంబ్లీ, 18 పార్లమెంటు స్థానాల్లో తెదేపా గెలుస్తుందని సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు.

కడప జిల్లాలోనూ తెదేపా మెజార్టీ స్థానాలు సాధిస్తుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి పదవీ వ్యామోహం ఎక్కువైందని... అందుకే రాష్ట్ర ప్రజలు తెదేపా వైపు మొగ్గు చూపారని చెప్పారు.

సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details