Cm Jagan Kadapa Tour: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం వైయస్‌ఆర్ జిల్లా పులివెందులలోని వేముల మండల నాయకులతో గురువారం దాదాపు మూడు గంటలపాటు గడిపారు. మండలంలోని వేల్పుల గ్రామానికి సాయంత్రం 4.30 గంటలకు చేరుకున్న ఆయన రాత్రి 7.10 వరకు ఇక్కడే ఉన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, నేతలు భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి, అభిషేక్‌రెడ్డి, రామలింగారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బయ్యపురెడ్డి సహా నాయకులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరించారు. వేల్పుల గ్రామంలో రూ.3.22 కోట్లతో నిర్మించిన గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్, వ్యవసాయ సహకార పరపతి సంఘం, డిజిటల్ గ్రంథాలయం, తపాలా కార్యాలయం, నీటి శుద్ధికేంద్రం, రక్షిత తాగునీటి పథకం, ప్రయాణికుల ప్రాంగణాన్ని సీఎం ప్రారంభించారు. ఈ ప్రాంగణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించారని, అన్ని సేవలు ఒకేచోట అందించడం ఆనందదాయకమని అన్నారు. ఆయా భవనాల్లో ముఖ్యమంత్రి కలియదిరిగారు. అధికారులకు సూచనలిచ్చారు. ప్రజలతోనూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ అర్జీలు స్వీకరించారు. సమస్యలను వింటూ పరిష్కారానికి హామీలిచ్చారు. అనంతరం రహదారి మార్గంలో ఇడుపులపాయకు వెళ్లారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.15 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడినుంచి వేములకు హెలికాప్టర్‌లో రావాల్సి ఉండగా వర్షం కారణంగా వాతావరణం సహకరించక రోడ్డు మార్గంలో వేల్పులకు చేరుకున్నారు. ఆయన రాక నేపథ్యంలో బెస్తవారిపల్లె వద్ద ట్రాఫిక్ నిలిపేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
వేల్పులలో గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సీఎం - సీఎం జగన్
CM Jagan Kadapa Tour: సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు సొంత నియోజకవర్గంలోని వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకున్నారు.
నేడు వైఎస్‌కు నివాళులర్పించనున్న సీఎం
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కుటుంబీకులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించనున్నారు. అనంతరం తన నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలతో మండలాలవారీగా సమావేశమవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం పదింటినుంచి సాయంత్రం ఐదింటి వరకు పార్టీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం రాత్రి ఇక్కడే బస చేసి శనివారం ఉదయం తిరుగు ప్రయాణమవుతారు.
ఇవీ చదవండి: