ముఖ్యమంత్రి జగన్ ఈరోజు నుంచి రెండు రోజుల పాటు వైఎస్సాఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు పులివెందుల, వేంపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎం.. శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు పులివెందుల చేరుకుంటారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు.
ఆ తర్వాత 1.30 గంటలకు పులివెందుల చేరుకొని న్యూటెక్ బయోసైన్సెస్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు వేంపల్లె చేరుకుంటారు. 3.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ స్మారక పార్క్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు వేంపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ విద్యార్ధిని, విద్యార్ధులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు.