ఈనెల 7, 8 తేదీల్లో కడప జిల్లా ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ కలసి పర్యవేక్షించారు. జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా... కుటుంబసభ్యులతో కలిసి జగన్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ఇడుపులపాయలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్, వైఎస్ఆర్ ఘాట్, గెస్ట్ హౌస్, ఆర్కే వ్యాలీలో ఆటోమేటిక్ థర్మల్ గన్లను సిద్ధం చేశారు. మాస్క్ తప్పనిసరిగా ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టారు.