కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ఇడుపులపాయ నుంచి బద్వేల్‌కు వెళ్లారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం.. 3:30 గంటలకు కడపకు చేరుకొనున్నారు. కడపలో తొలుత.. సీపీ బ్రౌన్ గ్రంథాలయాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కడప కలెక్టరేట్ వద్ద కొత్తగా నిర్మించిన మహావీర్ సర్కిల్, ప్రారంభిస్తారు. తర్వాత మహావీర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి గన్నవరానికి బయలుదేరుతారు. ఈ మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెండవ రోజు కడప జిల్లాలో సీఎం పర్యటన.. - సీఎం జగన్ బద్వేల్ పర్యటన
కడప జిల్లా పర్యటనలో భాగంగా నేడు సీఎం జగన్.. బద్వేల్, కడప ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇప్పటికే ఆయన ఇడుపులపాయ నుంచి బద్వేల్ కు వెళ్లారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం.. 3:30 గంటలకు కడపకు చేరుకొనున్నారు.
కడప జిల్లాలో సీఎం పర్యటన