సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటిస్తోన్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రమం నుంచి కుటుంబ సమేతంగా కడప చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వచ్చారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి తన తండ్రికి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనదినోత్సవాన్ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం జగన్ - cm jagan
కడప జిల్లాలో పర్యటిస్తోన్న సీఎం జగన్...ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పార్థనలు చేశారు. అనంతరం గండి వీరాంజనేయస్వామిని దర్శించుకొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
![గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3776359-147-3776359-1562566632357.jpg)
గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం జగన్
గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం జగన్
కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగుతుంది. కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం సమీపంలోని గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్ఛారణలతో పండితులు సీఎంకు స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు. గండి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులు జగన్ శంకుస్థాపన చేశారు. అరటి పరిశోధన కేంద్రానికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళి
ఇదీ చదవండి :సొంత జిల్లా కడపలో పర్యటిస్తోన్న సీఎం జగన్
Last Updated : Jul 8, 2019, 1:05 PM IST