CM Jagan YSR District Tour: రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి జగన్.. వైఎస్సాఆర్ జిల్లాకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులకు వెళ్లారు. పులివెందల ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాశ్ రెడ్డి, పులివెందుల మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తోపాటు కౌన్సిలర్లు, తొండూరు మండలానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పులివెందుల, తొండూరు మండలాల నాయకులతో సీఎం జగన్ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. రెండు మండలాల్లో పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై సీఎం సమీక్షించారు. పార్టీ పటిష్టత కోసం మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అనంతరం పులివెందులలోని ఏపీ కార్లలో బయో సైన్స్ టెక్‌ను సీఎం ప్రారంభించారు.