ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో ప్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్‌ - కంపెనీ ప్రతినిధులతో సమావేశం - Cm jagan visit news

CM Jagan started Century Plywood Industry: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా గోపవరంలో సెంచరీ ప్లైవుడ్‌ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో పరిశ్రమ ఉత్పత్తి, పని తీరు, ఉపాధి అవకాశాలపై చర్చించారు.

cm_jagan_started_century_plywood_industry
cm_jagan_started_century_plywood_industry

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 7:01 PM IST

Updated : Dec 23, 2023, 8:10 PM IST

CM Jagan started Century Plywood Industry: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. మొదటి రోజు పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గోపవరంలో సెంచరీ ప్లైవుడ్‌ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో పరిశ్రమ ఉత్పత్తి, పని తీరు, ఉపాధి అవకాశాల గురించి చర్చించారు.

Century Ply Chairman Sajjan Bhajanaka Comments: భారతదేశపు అతిపెద్ద వుడ్ ప్యానెల్ అలంకార పరిశ్రమ అయిన సెంచరీ ప్లైబోర్డ్స్ (ఇండియా) లిమిటెడ్, ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానెల్ తయారీ ప్లాంట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైభవంగా ప్రారంభించినట్లు సెంచరీప్లై ఛైర్మన్ సజ్జన్ భజనకా పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక పటంలో విలువైన వనరుల నిక్షేపాల పరంగా వైయస్సార్ జిల్లా ఓ ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఒక సంభావ్య వ్యవసాయ పరిశ్రమ కేంద్రంగా గుర్తించినందున, సెంచరీప్లై ఇతర పారిశ్రామిక సంస్థల పెట్టుబడుల శ్రేణికి నాంది పలికిందన్నారు. రానురాను ఈ పరిశ్రమ దేశం మొత్తానికి ముఖ్యమైన ఫర్నిచర్ హబ్‌గా మార్చడానికి దారి తీయనుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లామినేట్, MDF, PVC యూనిట్ కోసం కంపెనీ దాదాపు రూ.1000 కోట్లు పెట్టుబడిని కేటాయించినట్లు ఛైర్మన్ సజ్జన్ భజనకా తెలియజేశారు.

పండగవేళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన- ముందు రోజు నుంచే విధిస్తున్న ఆంక్షలతో హడలెత్తుతున్న జనాలు

Centuryply Executive Director Keshav Bhajanka Comments: సెంచురీప్లై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ భజనకా మీడియాతో మాట్లాడుతూ ''ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ జిల్లాలో మొదటి ఇంటిగ్రేటెడ్ వుడ్ ప్యానల్ తయారీ యూనిట్‌ను ప్రారంభించాం. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది బద్వేల్ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. మేము మొదటి దశలో MDFలో రూ.700 కోట్లు, రూ.250 కోట్లు లామినేట్లు, PVCలో పెట్టుబడి పెట్టాం. ఈ నూతన యూనిట్ MDF ప్లాంట్‌లో మా ఉత్పత్తి సామర్థ్యాన్ని 950 M3 పెంచుతుంది. ఇది MDFలో మా కార్యకలాపాలను రెట్టింపు చేస్తుంది. రెండవ దశ విస్తరణ ప్రణాళికలలో రూ. 1000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నాం అని ఆయన అన్నారు.

శ్రీకాకుళంలో వైఎస్సార్‌ సుజలధార పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan Talks With Company Representatives: సెంచరీ ప్లైవుడ్‌ పరిశ్రమను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ కంపెనీ ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. పరిశ్రమ ఏ విధంగా పని చేస్తుంది?, ఉత్పత్తి పనితీరు ఎలా ఉండబోతుంది?, పరిశ్రమ ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? అనే వివరాలను ప్రతినిధుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరి, కడప రిమ్స్‌కు చేరుకున్నారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ కేర్‌ బ్లాక్‌, వైఎస్సార్‌ మానసిక వైద్యశాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. దీంతోపాటు రిమ్స్‌లో వైఎస్సార్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. చివరగా కడప కోటిరెడ్డి సర్కిల్ చేరుకున్న సీఎం జగన్, అంబేద్కర్‌ సర్కిల్‌ను ప్రారంభిం‍చారు.

చింతపల్లిలో సీఎం జగన్ పర్యటన - బస్సుల్లేక ఉద్యోగులు, ప్రయాణికుల ఇబ్బందులు

Last Updated : Dec 23, 2023, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details