ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ - ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన
మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి తొలి రోజు బిజీబిజీగా గడిపారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన... అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ చేరుకున్నారు. రాత్రికి స్థానికంగా ఉన్న గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.