CM Jagan Participated in Christmas Celebrations at Pulivendula:క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లాలో గత మూడురోజులుగా పర్యటిస్తున్నారు. మూడవ రోజు పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఉదయం ఇడుపులపాయ నుంచి నుంచి పులివెందులకు చేరుకున్న జగన్ స్థానిక సీఎస్ఐ చర్చ్‌లో (CM Jagan celebrate Christmas) తల్లి విజయమ్మతో కలిసి కుటుంబ సభ్యుల సమక్షంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్ పండగ సందర్భంగా కేక్ కట్ చేసి తల్లి విజయమ్మకు తినిపించారు. 2024 నూతన క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సీఎం తెలియజేశారు. అక్కడికి వచ్చిన ప్రజలందరినీ పలకరించి వారి ద్వారా అర్జీలు స్వీకరించారు. పులివెందుల నుంచి హెలికాప్టర్లో మైదుకూరుకు వెళ్లనున్నారు.
పండగవేళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన- ముందు రోజు నుంచే విధిస్తున్న ఆంక్షలతో హడలెత్తుతున్న జనాలు
CM Jagan Attend Wedding Ceremony:సీఎం జగన్ ఎక్కడకు వెళ్తే అక్కడ స్థానికులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు ఆంక్షల పేరుతో పోలీసులు జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. కిలోమీటర్ల దురం ట్రాఫిక్ ఆపేస్తుంటారు. దీంతో స్థానికులు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మైదుకూరులో పర్యటిస్తున్నారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు మధ్యాహ్నం తర్వాత వెళ్లనున్నా ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి.