రాయలసీమలోని ప్రాజెక్టులను వీలైనంత వేగంగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. మైదుకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కుందూనదిపై జొలదరాశి, రాజోలి రిజర్వాయర్లకు, కుందూ - బ్రహ్మంసాగర్ ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కేసీ కెనాల్ కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంచనున్నట్లు వెల్లడించారు.
రాయలసీమ ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేస్తాం: సీఎం జగన్ - కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యకరమైన విషయాలు చూశారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి జగన్