కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై వైకాపా నేతలు, మంత్రులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను పార్టీ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఉపఎన్నికకు వైకాపా తరఫున ఇన్‌ఛార్జ్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తున్నట్లు చెప్పారు. ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని.. అన్ని సామాజిక వర్గాలకు కలుపుకొని వెళ్లాలని సూచించారు. గ్రామస్థాయి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించానన్నారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టాలని జగన్ సూచించారు.
పెద్దిరెడ్డికి సహాయకులుగా మంత్రులు సురేశ్, అంజద్ బాషా వ్యవహరించనున్నారు. పెద్దిరెడ్డికి.. ఎంపీలు అవినాష్, మిథున్ రెడ్డి సహాయకులుగా వ్యవహరించనున్నారు. సీఎం జగన్.. ఒక్కో మండల బాధ్యత ఒక్కో ఎమ్మెల్యేకు అప్పగించారు.