కడప రాయచోటి రైల్వే గేట్ వద్ద రూ. 82 కోట్లతో నిర్మించిన రైల్వే వంతెనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 50 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ వంతెన నిర్మాణం ఇప్పటికి పూర్తికావటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. సీఎం జగన్ అక్కడినుంచి రిమ్స్‌కు వెళ్లారు. ఆ తరువాత ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు వెళ్లారు. రేపు, ఎల్లుండి ముఖ్యమంత్రి జిల్లాలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 25వ తేదీ కుటుంబ సభ్యులతో కలసి పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.
50 ఏళ్ల నిరీక్షణకు తెర... అందుబాటులోకి వంతెన - సీఎం జగన్ కడప జిల్లా పర్యటన
కడప శివారులోని రాయచోటి రైల్వే గేటు వద్ద నిర్మించిన హై లెవల్ రైల్వే వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ దీనిని ప్రారంభించారు.
వంతెనను ప్రారంభిస్తున్న సీఎం జగన్