సీఎం జగన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ హరికిరణ్‌తో కలసి ఎస్పీ అన్బురాజన్ ఇడుపులపాయలో పర్యటించారు. ఘాట్ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్ టెస్ట్ చేయించుకునే రావాలని లేకుంటే.. అనుమతి లేదని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్, అతిథి గృహం, వైఎస్ఆర్ ఘాట్ సమీపంలో ఆటోమెటిక్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన.. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు - ఇడుపులపాయకు జగన్ న్యూస్
సెప్టెంబర్ 2వ తేదీన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయ వద్ద అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సీఎం పర్యటన.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు