ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇవాళ కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్

సీఎం జగన్ 7, 8వ తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్​ను సందర్శించి కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

cm jagan kadapa tour on 7th july
cm jagan kadapa tour on 7th july

By

Published : Jul 6, 2020, 3:46 AM IST

Updated : Jul 7, 2020, 3:19 AM IST

ముఖ్యమంత్రి జగన్‌... ఇవాళ, రేపు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం... రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు సీఎం తండ్రి వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి జయంతి కాగా.. ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఘాట్‌ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో వైఎస్​ఆర్​ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. నూతనంగా నిర్మించిన అకడమిక్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం, 3 మెగావాట్లతో నిర్మించే సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎస్పీ అన్బురాజన్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డి.. జగన్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్న ఎస్పీ... కొవిడ్‌ పరీక్ష చేయించుకున్న వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

అక్టోబరులో 'జగనన్న తోడు'

చిరు/విధి వ్యాపారాలకు ఆర్థిక భరోసా కల్పించే 'జగనన్న తోడు' పథకాన్ని అక్టోబరులో ప్రభుత్వం ప్రారంభించనుంది. చిన్న పాటి వ్యాపారాలు చేసుకునే వారికి సంప్రదాయ వృత్తులు చేసే హస్త కళాకారులకు ఈ పథకం కిదం రూ.10 వేల వరకూ వడ్డీ లేని రుణాన్ని ఇస్తారు. అర్హుల గుర్తింపు కోసం ఈ నెల 6 నుంచి జులై 13 వరకు వాలంటీర్లు సర్వే నిర్వహిస్తారు. 16వ తేదీ నుంచి 23 వరకు సామాజిక తనిఖీ నిమిత్తం సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శిస్తారు.

ఇదీ చదవండి:

'కరోనా పరీక్షల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌'

Last Updated : Jul 7, 2020, 3:19 AM IST

ABOUT THE AUTHOR

...view details