ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని... రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. అధికారులు మాత్రం రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కడప జిల్లాకు సంబంధించి సుమారు రూ. కోటిన్నర విలువగల 8లక్షల శనగ సంచుల విషయంలో గోల్ మాల్ జరిగిందన్నారు. జిల్లాకు ఎనిమిది లక్షల సంచులు అవసరం కాగా కేవలం వేల సంఖ్యలో సరఫరా చేసి... అధికారులు చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై అధికారులు స్పందించాలన్నారు. రైతుల విషయంలో సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. శనగ సంచుల టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలను అధికారులు విచారించి వాటిపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేయాలని సూచించారు.