ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2021, 7:47 PM IST

ETV Bharat / state

రేపు కడప ఆర్టీసీ ఆస్పత్రి ప్రారంభించనున్న సీఎం జగన్

కడపలోని ఆర్టీసీ ఏరియా ఆస్పత్రిని రేపు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Kadapa RTC Hospital
Kadapa RTC Hospital

కడపలో ఆర్టీసీ కార్మికుల నిధులతో నిర్మించిన ఏరియా ఆస్పత్రిని రేపు ఉదయం 11 గంటలకు మంగళగిరిలో సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి కార్యక్రమంలో హాజరవుతారు.

రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ కార్మికులు అక్కడ వైద్య సేవలను పొందవచ్చు. అత్యాధునిక సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టారు. శస్త్ర చికిత్సలు చేసేందుకు లక్షల రూపాయలు వెచ్చించి సామగ్రి కొనుగోలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details