ముఖ్యమంత్రి జగన్ కడపలో రెండు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిన్న ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి జిల్లాకు వచ్చిన ఆయన... ఉదయం కడప మేయర్ సురేష్ బాబు కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు. సురేష్ బాబు కుమార్తెను ఇంటికి వెళ్లి ఆశీర్వదించారు. కడప ఎన్జీవో కాలనీలో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. చాపాడు మండలానికి చెందిన మౌర్యా రెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆమె వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
జాయింట్ కలెక్టర్ వివాహానికి హాజరైన సీఎం జగన్ - జాయింట్ కలెక్టర్ వివాహానికి హాజరైన జగన్
కడప, కర్నూలులో పలు వివాహ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. కడపలో నగర మేయర్ కుమార్తెతో పాటు, నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కర్నూలులో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ కుమారుడి పెళ్లికి సీఎం జగన్ హాజరయ్యారు.

జాయింట్ కలెక్టర్ వివాహానికి హాజరైన సీఎం జగన్
అనంతరం కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ కుమారుడి పెళ్లికి సీఎం జగన్ హాజరయ్యారు. సీఎం రాక దృష్ట్యా రెండ్రోజుల ముందే కర్నూలులోని విద్యార్థి, ప్రజాసంఘాలు, వామపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణానగర్ ప్రాంతంలో దుకాణాలు మూయించేశారు.
ఇదీ చదవండి: కరచాలనం చేసేందు కార్యకర్త ఉత్సాహం.. కొట్టిన మంత్రి..!