CM is cheating once again in setting up the steel industry: కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో సీఎం జగన్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. ముచ్చటగా మూడోసారి ప్రైవేటు కంపెనీకి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బాధ్యతలను అప్పగించారని ఆక్షేపించారు. ఈనెల 23 నాటికి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని మూడేళ్ల కిందట గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు జిల్లా ప్రజలకు ఏం సమాధానం చెబుతారని విపక్ష నాయకులు నిలదీశారు. మార్చిలోపు జిందాల్ స్టీల్ సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించక పోతే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో సీఎం మరోసారి మోసం చేస్తున్నారు: అఖిలపక్ష నేతలు - AP highlights
CM is cheating once again in setting up the steel industry: కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సీఎం జగన్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని విపక్ష నాయకులు విమర్శించారు. మూడేళ్ల కిందట గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో సీఎం మరోసారి మోసం చేస్తున్నారు