ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం తొలి సంతకం లబ్దిదారులకు ఆనందం - rachamallu

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్​ రెడ్డి జగన్​పై ప్రశంసల జల్లు కురిపించారు. పింఛను పెంపు నిర్ణయం పట్న లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలన్నీ అందిస్తామని హామీ ఇచ్చారు.

సీఎం తొలి సంతకం లబ్దిదారులకు ఆనందం

By

Published : Jun 2, 2019, 7:48 AM IST

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు నుంచే పరిపాలనపై స్పష్టంగా ఉన్నారని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. 2,250 రూపాయల పింఛను పెంపుపై జగన్ తొలి సంతకం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆనందపడుతున్నారని హర్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను అందించే విధంగా ముందుకు సాగుతామన్నారు. ఎలాంటి తారతమ్యం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన వారిలో అర్హులైన వారందరికీ పింఛన్​తో పాటు ప్రభుత్వ పథకాలన్నీ అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పింఛనుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

సీఎం తొలి సంతకం లబ్దిదారులకు ఆనందం

ABOUT THE AUTHOR

...view details