సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ఆదినారాయణరెడ్డి - krishna water issue cm dission
నీటి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని భాజపా నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు.
మాట్లాడుతున్న భాజపా నేత ఆది నారాయణరెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీటి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భాజపా నేత ఆదినారాయణరెడ్డి కడపలో అన్నారు. ముఖ్యమంత్రిని ఈ విషయంలో అభినందిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. గోదావరి జలాలను తెలంగాణ ఉపయోగించుకున్నప్పుడు ఏపీ అడ్డుకోలేదని గుర్తు చేశారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.