ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతల మధ్య వాగ్వాదం.. ఖాజీపేటలో కలకలం - khajipeta panchati elections update

కడప జిల్లా ఖాజీపేటలో వైకాపా నేతల మధ్య వర్గ పోరు బయటపడింది. పోలింగ్ కేంద్రం వద్దే.. వైకాపాలోని ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకున్నారు.

clashes between ycp leaders
ఖాజీపేటలో భగ్గుమన్న వర్గపోరు

By

Published : Feb 9, 2021, 1:16 PM IST

కడప జిల్లా ఖాజీపేటలో వైకాపా నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. పోలింగ్ కేంద్రం వద్దే ఇరు వర్గాల నేతలు రెచ్చగొట్టే విధంగా పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్న కారణంగా... వాగ్వాదం మెుదలైంది. వైకాపాకు చెందిన ఇద్దరు మద్దతుదారులు సర్పంచ్ అభ్యర్థులుగా ఖాజీపేటలో.. నామినేషన్లు దాఖలు చేశారు. 30 ఏళ్ల తరువాత అక్కడ ఎన్నికలు జరుగుతున్న కారణంగా.. ఇరు వర్గాల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పోలింగ్ కేంద్రానికి రావటంతో.. మరో వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే... ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల నేతలకు పోలీసులు సర్ది చెప్పి... రవీంద్రారెడ్డిని బందోబస్తు మధ్య అక్కడ నుంచి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details