కడప జిల్లా రామరాజుపల్లెలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు మహిళలు గాయపడ్డారు. గ్రామంలోని ఓ వ్యక్తి మద్యం తాగి ఇళ్ల ఎదుట హల్చల్ చేస్తుంటే స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మద్యం తాగిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చి స్థానిక మహిళలపై రాళ్లు, కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రామరాజుపల్లెలో ఇరువర్గాల మధ్య ఘర్షణ... మహిళలకు గాయాలు - ramarajupalle latest news
కడప జిల్లా రామరాజుపల్లెలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు