కడప జిల్లా కొండాపురం మండలం కోడూరు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉండగా... అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి...శంకర్ ఇంట్లోకి వెళ్లి కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో ఇద్దరూ గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
కోడూరులో కత్తితో దాడి...ఇద్దరికి గాయాలు - కడప జిల్లా ప్రధాన వార్తలు
కడప జిల్లా కోడూరు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా వారిని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఘర్షణలో గాయపడ్డ బాధితుడు
గతంలో ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల ఘర్షణ జరిగిందని...దాన్ని మనసులో పెట్టుకుని ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడ్డ వారిని అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు కొండాపురం ఎస్సై విద్యాసాగర్ తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఎస్సై చెప్పారు.
ఇదీ చదవండి