ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐఐఐటీ ఆర్​కే వ్యాలీలోని విద్యార్థుల మధ్య ఘర్షణ - iiit idupulapaya

కడప జిల్లా ఇడుపులపాయ ఐఐఐటీ ఆర్​కే వ్యాలీలోని విద్యార్థులు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను చెదరగొట్టారు. ఓ అమ్మాయితో.. ఓ విద్యార్థి అసభ్యకరంగా మాట్లాడాడనే నేపంతో మూడు రోజుల క్రితం వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.

Clash between students at iiit idupulapaya
ఇడుపులపాయ ఐఐఐటీలో కట్టెలతో కొట్టుకున్న విద్యార్థులు

By

Published : Apr 4, 2021, 9:07 PM IST

ఆర్​కే వ్యాలీలోని విద్యార్థుల మధ్య ఘర్షణ

కడప జిల్లాలోని ఇడుపులపాయ ఐఐఐటీ ఆర్​కే వ్యాలీలో ఈ3, ఈ4 విభాగాల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను చెదరగొట్టారు. పోలీసు, అధికారులు.. నచ్చజెప్పినా విద్యార్థులు శాంతించకపోవడంతో వాళ్లను వేరువేరు గదుల్లో ఉంచారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. పలువురుకి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.

ఆర్​కే వ్యాలీలోని ఈ3 విద్యార్థి ఈ4కు చెందిన ఓ అమ్మాయితో తప్పుగా మాట్లాడాడని.. దీంతో ఆమె ఈ4లోని తన స్నేహితునికి చెప్పడంతో మూడు రోజుల క్రితం మొదలైన వివాదం ఇవాళ గొడవకు దారితీసిందని తెలుస్తోంది. అయితే ఐఐఐటీ అధికారుల ముందే గొడవ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని కొందరు విద్యార్థులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details