కడప జిల్లా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి ఎవరన్న దానిపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల ఈ మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కాలధర్మం చేయగా.. ఆయన ఇద్దరి భార్యల కుమారులు మఠాధిపతి మాదే అంటే మాదే అని పోటీపడగా.. నియామక వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
బ్రహ్మంగారి మఠాధిపతిపై రేపు స్పష్టత వస్తుంది: శివ స్వామి - శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి వార్తలు
కడప జిల్లా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి నియామకం వివాదాస్పదంగా మారింది. చర్చల అనంతరం రేపు ఉదయం.. మఠాధిపతి నియామక వ్యవహారం కొలిక్కి వస్తుందని శివ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి తెలిపారు. మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇటీవలే కాలధర్మం చెందారు.
శివ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి
రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చి.. చర్చలు జరిపేందుకు శివ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మంగారి మఠానికి తరలివచ్చారు. చర్చల అనంతరం రేపు ఉదయం మఠాధిపతి నియామక వ్యవహారం కొలిక్కి వస్తుందని శివ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి తెలిపారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
ఇదీ చదవండి
బ్రహ్మంగారిమఠంలో ఆధిపత్య పోరు.. పీఠంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన!
Last Updated : Jun 4, 2021, 11:01 PM IST