కడప జిల్లా చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివగోపాల్ రెడ్డి తండ్రి శివారెడ్డి రైతు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన శివగోపాల్.. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో సీటు తెచ్చుకున్నారు. అక్కడ కెమికల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని సివిల్స్ శిక్షణ కోసం దిల్లీ వెళ్లారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా.. రెండో ప్రయత్నంలో ప్రతిభ కనబరిచి ఆలిండియా స్థాయిలో 263వ ర్యాంకు సాధించారు.
మొదటి ప్రయత్నంలో విఫలం.. రెండో ప్రయత్నంలో ఆలిండియా ర్యాంకు - సివిల్స్ ర్యాంకర్ శివగోపాల్ రెడ్డి
కడప జిల్లా మైదుకూరు పురపాలక సంఘం చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివగోపాల్ రెడ్డి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో 263వ ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్ చదివిన శివగోపాల్ రెండో ప్రయత్నంలో ఈ ర్యాంకు తెచ్చుకున్నారు.

శివగోపాల్ రెడ్డి, సివిల్ ర్యాంకర్