కడప జిల్లా రాయచోటిలో సీఐటీయూ నిరసన కార్యక్రమం చేపట్టింది. శ్రామిక వర్గం హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సీఐటీయూ శ్రేణులు సేవ్ ఇండియా పేరుతో నిరసన తెలిపారు. కరోనా కాలంలో ప్రభుత్వం కల్పించే అరకొర సదుపాయాలతోనే కార్మిక ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని అన్నారు. మరోవైపు కార్మిక చట్టాలను, హక్కులను కుదిస్తూ, ఉద్యమాల మీద ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమన్నారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. భవిష్యత్ లో కార్మిక చట్టాలను హక్కుల రక్షణకై పోరాడతామన్నారు.
రాయచోటిలో సీఐటీయూ నిరసన - రాయచోటిలో సీఐటీయూ నిరసన
కడప జిల్లా రాయచోటిలో సీఐటీయూ నిరసన కార్యక్రమం చేపట్టింది. శ్రామిక వర్గం హక్కులు, చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాయచోటిలో సీఐటీయూ నిరసన