కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాలని... కడపలో సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి నివారణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికీ కొవిడ్ ఆసుపత్రిలో కనీస వసతులు లేవన్నారు. రోజురోజుకు వ్యాధి వ్యాప్తి ఎక్కువవుతున్న దృష్ట్యా ప్రభుత్వం మరిన్ని ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే.. ఆగస్టు 9న ఆందోళన చేస్తామన్నారు.
కరోనాతో నిమిత్తం లేకుండా ప్రతి ఇంటికి రూ.7,500 ఇవ్వాలి: సీఐటీయూ - కడపలో సీఐటీయూ నాయకుల నిరసన న్యూస్
కరోనాతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి రూ.7,500 ఇవ్వాలని సీఐటీయూ కడప జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి అన్నారు. కరోనా సంక్షోభం సమయంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

citu leaders protest on govt about corona