కొవిడ్ సమయంలో విధుల్లోకి తీసుకున్న కార్మికులను తొలగించడాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో తొలగించలేదని... ఒక్క కడప జిల్లాలోనే తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. 170 మంది కుటుంబాలను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు. తొలగించిన మున్సిపల్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు.
'ఆ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి'
కరోనా సమయంలో విధుల్లోకి తీసుకున్న కార్మికులను తొలగించటాన్ని సీఐటీయూ ఖండించింది. వారిని విధుల్లోకి తీసుకోవాలని కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కడప జిల్లా 170 మంది తొలగించటం దారుణమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కడప జిల్లా కలెక్టరేట్ ముందు సీఐటీయూ ధర్నా
తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని... లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి:పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు