ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పౌరసత్వ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం' - latest news Citizenship Act to be abolished muslim meeting

పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప ఈద్గా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మూడు మతాల పెద్దలు హాజరయ్యారు.

పౌరసత్వ చట్టం రద్దు చేయాలని..బహిరంగ సభ
పౌరసత్వ చట్టం రద్దు చేయాలని..బహిరంగ సభ

By

Published : Jan 19, 2020, 2:05 PM IST

పౌరసత్వ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమించాలని ముస్లింల నిర్ణయం

పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సోదరులు కదం తొక్కారు. చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కడప ఈద్గా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మూడు మతాల పెద్దలు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని మేమందరమూ భారతీయులమని.. విడదీసే శక్తి ఎవరికీ లేదంటూ నినాదాలు చేశారు. ఒకే దేశం..ఒకే మతం అనే నినాదంతో భాజపా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆరోపించారు. దేశాన్ని పాలించేది ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. అందరమూ కలిసికట్టుగా పోరాటాలు చేసి..ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లేదంటే భవిష్యత్​లో ముస్లిం పిల్లలకు తీరని సమస్యలు వస్తాయని వారు స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

sabha

ABOUT THE AUTHOR

...view details