కడప జిల్లా ఖాజీపేటకు చెందిన ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీనివాసులుకు సంబంధించిన గోదాములలో సీఐడీ అధికారులు ఆదివారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఎర్రగుంట్లలోనూ మరో బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. రెండ్రోజుల కిందట గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో నిర్వహించిన సోదాలలో రూ. కోటి నగదుతోపాటు 3 కిలోల బంగారు నగలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మరోసారి తనిఖీలు చేపట్టారు. వస్త్రాలను ఇక్కడే నేశారా? మరెక్కడి నుంచైనా తెప్పించారా అనే విషయాలపై లోతుగా పరిశీలన చేస్తున్నారు. అక్కడ పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించి వివరాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆప్కో మాజీ ఛైర్మన్ గోదాములలో సీఐడీ తనిఖీలు - ఆప్కో మాజీ ఛైర్మన్ ఇంట్లో సోదాల వార్తలు
కడప జిల్లా ఖాజీపేటకు చెందిన ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీనివాసులుకు సంబంధించిన గోదాములలో సీఐడీ అధికారులు ఆదివారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. అక్కడ పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించి వివరాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆప్కో మాజీ ఛైర్మన్‌కు సంబంధించిన గోదాములలో సీఐడీ తనిఖీలు