ప్రాణవాయువు లేకుండా ఏ ఒక్కరూ చనిపోవడానికి వీల్లేదని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ అన్నారు. కడప జనసేన పార్టీ కార్యాలయంలో.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ఆక్సిజన్ బ్యాంక్‌ను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఆక్సిజన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. చిరంజీవి కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ల బ్యాంకును ప్రారంభించడం అభినందనీయమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు.
కడపలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం - ఈరోజు కడపలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం వార్తలు
కడప జనసేన పార్టీ కార్యాలయంలో.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ఆక్సిజన్ బ్యాంక్‌ను ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాణవాయువు సిలిండర్లు వస్తాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు.
చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం
ఇవీ చూడండి..
TAGGED:
chiranjeevi oxgen bank