కడప శివారులోని అలంఖాన్ పల్లె యతి ఆశ్రమంలో 81 అడుగుల వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిష్ఠించారు. నిన్న రాత్రి కడపకు చేరుకున్న చినజీయర్ స్వామీజీ... ఉదయమే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన 108 కలశాలతో విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. పుష్కరిణిలో దేవతా మూర్తుల విగ్రహాలకు స్నానం చేయించి... అనంతరం ఆశ్రమంలో ముగ్గురు దేవతా మూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూజలు, మంత్రోచ్ఛరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడపలో 81 అడుగుల వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ - అలంఖాన్ పల్లెలో 81 అడుగుల వెంకటేశ్వరస్వామి
దేశంలో ఎక్కడా లేని విధంగా 81 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కడప శివారులో ఘనంగా జరిగింది. కడప శివారులోని అలంఖాన్ పల్లె యతి ఆశ్రమంలో వెంకటేశుని విగ్రహాన్ని త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిష్ఠించారు.

81 అడుగుల వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చినజీయర్ స్వామి
81 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చినజీయర్ స్వామి