ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 22, 2020, 10:17 PM IST

ETV Bharat / state

బద్వేల్​లో బాలుడు ఆదృశ్యం... రంగంలోకి దిగిన పోలీసులు

కడప జిల్లా బద్వేల్​లో ఓ బాలుడు ఆదృశ్యం అయ్యాడు. స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవటంతో అతని తల్లి దండ్రులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

బద్వేల్ లో బాలుడు ఆదృశ్యం
బద్వేల్ లో బాలుడు ఆదృశ్యం

కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని శాస్త్రినగర్​కు చెందిన అల్తాఫ్ అనే బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు బయటికి వెళ్లాడు. సాయంత్రమైన తిరిగి ఇంటికి రాకపోవటంతో తల్లి దండ్రులు కంగారుపడ్డారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ తెలిస్తే బద్వేల్ పోలీస్​స్టేషన్ 9121100627 నంబర్​కు ఫోన్ చేయాలని బద్వేల్ ఎస్సై సురేశ్ రెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details