ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంపచెట్లపాలైన పసికందు! - kadapa district latest updates

గోప‌వ‌రం పంచాయ‌తీ యానాది కాల‌నీలో కంపచెట్ల‌లో శిశువు ఉన్న‌ట్లు స్థానికంగా ఉండే ఓ మ‌హిళ గుర్తించింది. దీంతో ఆ ప‌సి కూన‌ను రాత్రి ఇంట్లోనే ఉంచుకుని మరుసటి రోజు ఉద‌యాన్నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. ప్ర‌స్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

child found in road side at kadapa district
పాపం పసికూన

By

Published : Apr 28, 2020, 12:49 PM IST

తల్లి ఒడిలో ఉండాల్సిన శిశువు కంపచెట్లలో దర్శనమిచ్చాడు. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కంపచెట్లలో పడేసి వెళ్లారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని గోపవరం పంచాయతీ యానాదికాలనీలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

కాసేపటికి శిశువు ఏడుపును గుర్తించిన ఓ మహిళ.. పసికూనను చేరదీసింది. సోమవారం ఉదయమే పోలీసులకు సమాచారమిచ్చింది. శిశువును ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details