ఓ తండ్రి అప్పుడే పుట్టిన బిడ్డను కడప రైల్వేస్టేషన్లో వదిలివెళ్లాడు. చిన్నారిని రేణిగుంట రైల్వే పోలీసులు గుర్తించి, ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. గురువారం రాత్రి షిరిడి నుంచి తిరుపతికి వెళ్తున్న రైలు కడప రైల్వే స్టేషన్లో ఆగింది. ఆ సమయంలో ఓ తండ్రి పాపను తీసుకుని కడప రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. స్టేషన్లో ఆగిన రైలులో పాపను పడుకోబెట్టి వెళ్లిపోయాడు. పాపను గుర్తించిన ప్రయాణికులు రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. వ్యక్తి ఆటో దిగి, స్టేషన్లోకి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాన్న.... నే చేసిన నేరమేంటీ..? - ఆడబిడ్డను రైలు విడిచిన తండ్రి
కన్నైనా తెరవలేదు... తల్లిని గుర్తించనే లేదు. అమ్మ పొత్తిళ్లలలో, జోలపాటలతో నిద్రించాల్సిన చిన్నారిని రైలు కూతలు బుజ్జగించాయి. ఎక్కడుందో తెలీదూ... పయనమెటో ఎరుగదు. ఇది ఓ చిన్నారి పరిస్థితి. ఇంతకీ ఆ పాప దుస్థితికి కారణమేంటి..?
నాన్న.... నే చేసిన నేరమేంటీ..?
Last Updated : Oct 26, 2019, 12:00 AM IST