అమరావతి భూముల వ్యవహారంలో తప్పు చేయకపోతే చంద్రబాబు విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని... ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. వరదల వల్ల నష్టం వాటిల్లిందన్న ఆయన... నష్ట నివారణ చర్యల విషయంలో ప్రభుత్వం బాగా పనిచేస్తోందని పేర్కొన్నారు. జలాశయాలు నిండి రైతుల ఆనంద పడుతుంటే చంద్రబాబు, లోకేశ్ తట్టుకోలేకపోతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
'తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు అంగీకరించడం లేదు' - Srikanth Reddy comments on chandrababu
తెదేపా అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి భూముల వ్యవహారంలో తప్పు చేయకపోతే చంద్రబాబు విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు.

చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి