ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో మహిళా సాధికారితకు పెద్దపీట: ప్రముఖుల ప్రశంసలు - kadapa latest news

మహిళా సాధికారతే లక్ష్యంగా ఏపీలో సీఎం జగన్ సర్కారు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని దేశంలోని పలు రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు ప్రశంసించారు. వీరి సందేశాలతో కూడిన సీడీని జగన్ ఆవిష్కరించారు.

Chief Minister Jagan unveiled a CD designed by Mrs. Vasireddy Padma.
సీడీ ఆవిష్కరించిన సీఎం జగన్

By

Published : Dec 25, 2020, 6:44 AM IST

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళల పేరు మీద జరగనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మహిళా సాధికారతకు పెద్దపీట అని దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు కొనియాడారు. వారి సందేశాలతో ఏపీ మహిళా కమిషన్‌

ఛైర్​పర్సన్‌ శ్రీమతి వాసిరెడ్డి పద్మ రూపొందించిన సీడీని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు.

మహిళల పేరు మీద ఇళ్ల పట్టాల పంపిణీపై పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, పీటీ ఉషా, సుధామూర్తి, అపోలో సంగీతారెడ్డి, పద్మావతి విశ్వవిద్యాలయం వైస్​ ఛాన్సలర్ జమున, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్​కు చెందిన ఫ్రీడా, యూనిసెఫ్ ఇండియా డా. యస్మిన్‌ ఆలీ హక్, కర్ణాటక, ఒడిశా, మణిపూర్, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, ఎంపీ నవనీత్‌ కౌర్, ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశంసలు వర్షం కురిపించారు.

ఇదీ చదవండి:

ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం.. ప్రారంభించనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details