కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట గ్రామ పరిధిలోని కాంపల్లి చెరువుకు అర్ధరాత్రి గండి పడింది. పంట పొలాల్లోకి నీరు రావటంతో అప్రమత్తమైన గ్రామస్థులు ఇసుక బస్తాలతో గండిని పూడ్చే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు.
కాంపల్లి చెరువుకు గండి..ప్రవాహం ఆపేందుకు గ్రామస్థుల యత్నం - chinthakommadinne latest news
భారీ వర్షాల కారణంగా జలాశయాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం కాంపల్లి చెరువుకు గండి పడింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Breaking News
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాంపల్లి చెరువు పూర్తిగా నిండిపోయింది. నీటి సామర్థ్యం ఎక్కువ కావడంతో మరిన్ని గండ్లు పడే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. అధికారులు సత్వరచర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి: గ్రామీణ ప్రాంతాల పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ