Cheeni Farmers Losses in YSR Kadapa: ఎండిపోతున్న చీనీ తోటలు.. సీఎం సొంత నియోజకవర్గంలో రైతులకు కష్టం.. Cheeni Farmers Losses in YSR Kadapa: ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో.. చీనీ తోటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. అంతుచిక్కని తెగుళ్లతో వందల ఎకరాల్లో పంట దెబ్బతింది. తెగుళ్లకు తోడు.. గిట్టుబాటు ధర లేక చీనీ రైతులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో 64 వేల ఎకరాల్లో చీనీ తోటలుండగా.. పులివెందుల నియోజకవర్గంలోనే 48 వేల ఎకరాల్లో పంట సాగులో ఉంది. వేలాది కుటుంబాలు చీనీ తోటలపై ఆధారపడి జీవిస్తున్నాయి.
Farmers on Cheeni Crop Prices: దళారుల అవతారం ఎత్తిన వ్యాపారులు.. నోటిమాటతోనే ధర నిర్ణయం.. లబోదిబోమంటున్న 'చీనీ' రైతులు
ఎకరాకు 150 నుంచి 170 మొక్కలు నాటుతారు. ఇటీవల ఎన్నడూ లేనంతగా ఎకరాకు 40 నుంచి 60 వరకు ఆరేడేళ్ల వయసున్న చెట్లు ఎండిపోతున్నాయి. మొక్క నాటిన నాలుగో ఏడాది నుంచి ఓ మోస్తరుగా.. ఐదో ఏట నుంచి పూర్తిస్థాయిలో చెట్లు దిగుబడులనిస్తాయి. మంచి దిగుబడులు వచ్చే సమయంలో చెట్లు చనిపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేంపల్లె, చక్రాయపేట, పులివెందుల మండలాల్లో చీనీ తోటలు విస్తారంగా ఉన్నాయి.
చిత్తైన చీనీ రైతు.. భానుడి భగభగలకు ఎండిపోయిన చెట్లు
రైతులు పోటీలు పడి పంట సాగు చేస్తున్నారు. సాధారణంగా వేరుకుళ్లిపోయి.. చెట్లు ఎండిపోవడం జరుగుతుంది. రైతులందరూ బిందు సేద్యం ద్వారానే మొక్కలకు నీటిని అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో వేరు కుళ్లుకు ఆస్కారం లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పంటకు నష్టం వస్తోందని.. ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు అక్కరకు రావడం లేదని రైతులు అంటున్నారు. ఉద్యానశాఖ అధికారులు మాత్రం రైతుల తప్పిదాలతోనే పంట దెబ్బతింటున్నట్లు చెబుతుండగా.. ఆదర్శ రైతుల పొలాల్లోనే నష్ట తీవ్రత అధికంగా ఉంది.
చీనీ రైతులను ప్రభుత్వేమే ఆదుకోవాలి: సీపీఎం
తెగుళ్లకు తోడు ఇప్పుడు పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అంతుచిక్కని తెగుళ్లతో చీనీ చెట్లు ఎండిపోతున్నాయని.. పరిష్కార మార్గం చూపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతోపాటు కరెంట్ కోతలతో నీళ్లు అందక కూడా కొన్ని చెట్లు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చీనీ తోటల రైతులను ఆదుకోవడానికి సీఎం జగన్ ప్రత్యేక చొరవ చూపాలని.. రైతులు వేడుకుంటున్నారు.
"ఎన్నడూ లేనంతగా ఎకరాకు 40 నుంచి 60 వరకు ఆరేడేళ్ల వయసున్న చెట్లు ఎండిపోతున్నాయి. మంచి దిగుబడులు వచ్చే సమయంలో చెట్లు చనిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా పంటకు నష్టం వస్తోంది. తెగుళ్లకు తోడు ఇప్పుడు పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నాం. దీంతోపాటు కరెంట్ కోతలతో నీళ్లు అందక కూడా కొన్ని చెట్లు ఎండిపోతున్నాయి. మా రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాం." - చీనీ రైతుల ఆవేదన
కార్యాలయాల చుట్టూ చీనీ రైతుల ప్రదక్షిణ