కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి అనే కాంట్రాక్టర్ శనగల వ్యాపారం, గోదాములు నిర్వహించేవాడు. ఇతని ఆస్తి చూసి అనేక మంది రైతులు కోట్ల రూపాయలు డబ్బులు అప్పుగా ఇచ్చారు. ఉప్పలపాడు గ్రామంలోనే సుమారు 300 మంది 20 కోట్ల రూపాయల మేర అప్పుగా ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.
'నమ్మి కోట్లలో అప్పుఇచ్చాం... న్యాయం చేయండి' - crime news in kadapa dst
పేరుకు పెద్ద కాంట్రాక్టర్..దానికితోడు శనగల వ్యాపారం. గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ఆ వ్యక్తిపై అందరికి నమ్మకం. అడగగానే కోట్లల్లో డబ్బు అప్పుగా ఇచ్చేశారు. తీరా ఆ డబ్బు తీసుకుని ఉడాయించాడు ఆ పెద్దమనిషి. ఈ ఘటన కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగింది.
cheating cases field in kadapa dst jammalamadugu
పెళ్లి కోసం, చదువుల కోసం దాచుకున్న డబ్బు వడ్డీ వస్తుందన్న ఆశతో అతనికి ఇస్తే ఉన్నఫలంగా ఉడాయించాడని రైతులు లబోదిబోమంటున్నారు. బాధిత రైతులు జమ్మలమడుగు డీఎస్పీని కలిసి అతనిపై ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నిందితుడిని పట్టుకుని రైతులకు న్యాయం చేస్తామని డిఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి