ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు - కడప జిల్లా నాటుసారా పట్టివేత తాజా వార్తలు

రైల్వే కోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. పది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు.

cheap liquor caught by seb officers
ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎస్​ఈబీ అధికారులు

By

Published : Oct 2, 2020, 8:51 AM IST

గురువారం జిల్లా అదనపు ఎస్పీ శ్రీ చక్రవర్తి ఆదేశాల మేరకు కోడూరు ఎస్​ఈబీ అధికారి రామ్మోహన్​... తన సిబ్బందితో కలిసి నాటుసారా, అక్రమ మద్యం స్థావరాలపై విస్తృత తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో కోడూరు మండలం తాడివాండ్లపల్లి గ్రామానికి చెందిన వంకాయల కృష్ణయ్య వద్ద 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుగుడు క్రాస్​ వద్ద వై. కోట గ్రామానికి చెందిన బొబ్బే సుబ్బయ్య వద్ద 5 లీటర్ల నాటుసారాను పట్టుకుని... నిందితుడిని అరెస్ట్​ చేశారు. ఇటువంటి చర్యల్లో ఎక్కువసార్లు పట్టుబడితే సదరు వ్యక్తులపై పీడీ యాక్ట్​ నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details