ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కడపకు రానున్నట్లు... మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3 రోజులపాటు కడపలోనే ఉండి... 10 నియోజకవర్గాల నేతలు... కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడనున్నారు.
ఈ నెల 25 నుంచి కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన - కడపలో చంద్రబాబు పర్యటన న్యూస్
పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న... చంద్రబాబు ఈ నెల 25న కడపకు రానున్నారు. 3రోజుల పాటు జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు.
chandra babu
పార్టీ బలోపేతం చేసేందుకు కార్యకర్తల్లో చంద్రబాబు నూతన ఉత్సాహం నింపుతారని... శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ 100 రోజుల పాలనలో... రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. ప్రజావేదిక కూల్చటంతో... తెదేపా నేతలు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని ఆరోపించారు. 2024లో తెదేపా జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.