బద్వేలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్ను గంజాయి మొక్కగా పోల్చారు. కడప జిల్లా బద్వేలులో తెదేపా ఎన్నికల ప్రచార సభకు హాజరైన ముఖ్యమంత్రి.. కడప జిల్లాలో మహానుభావులు పుట్టారని గుర్తు చేసుకున్నారు. అదేచోట.. గంజాయి మొక్క పుట్టిందని.. అది జగన్ అనీ అన్నారు. దేవుని గడప అని ఉన్న పేరును.. రాక్షసుల కడపగా మార్చారని విమర్శించారు. ఆ పేరును మార్చి చూపిస్తామని చెప్పారు.గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదన్న ముఖ్యమంత్రి...బద్వేలులో గోదావరి నీళ్లతో వ్యవసాయం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చాకే... కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇస్తానని.. అదీ తన ప్రత్యేకత అని స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించింది తానేనని...వేరే వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదని తేల్చిచెప్పారు.