కడప జిల్లా గండికోట నిర్వాసితులకు ఆర్అండ్ఆర్, ఓటీఎస్ ప్యాకేజీలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అటు వరదలకు వచ్చిన 26టీఎంసీల నీళ్లు గండికోట రిజర్వాయర్లో పెట్టుకునే అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఉదాసీనతకు ప్రజలు మూల్యం చెల్లించాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు, వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక ఉండి... సకాలంలో వాటిని అమలు చేస్తేనే ప్రజా ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. అవే గనుక లోపిస్తే జరిగే దుష్పరిణామాలకు, గండికోట ముంపు బాధితుల కష్టాలే నిదర్శనమన్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా తాళ్లపొద్దుటూరు ప్రజలను ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారని చంద్రబాబు ప్రశ్నించారు. గండికోట నిర్వాసితులకు సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్యాకేజీ ఇవ్వకుండా వెళ్లమంటే ఎక్కడికి వెళ్తారు? : చంద్రబాబు - కడప జిల్లా వార్తలు
గండికోట నిర్వాసితులకు సంబంధించిన వీడియోను తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.
తెదేపా అధినేత చంద్రబాబు