కడప జిల్లా పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు వైకాపా బాధితుల కష్టాలు విని చలించిపోయారు. పార్టీ మారకుంటే కేసులు పెడతామనే బెదిరింపులు సహా దాడులకు పాల్పడుతున్నారని పలువురు చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులకు చెందిన ఓ బాధితుడు ఇంటికి అడ్డంగా గోడ కట్టారని వాపోయాడు. పోలీసులు సైతం వారికే సహకరించారని తెలిపాడు. పార్టీ మారలేదని దాడి చేశారని ఓ వృద్ధుడు కంటతడి పెట్టగా ఓదార్చిన చంద్రబాబు... 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వైకాపాకు ఓటేయలేదని పత్తిపంట ధ్వంసం చేశారని, అట్రాసిటీ కేసు పెట్టారని ఇలా పలువురు పార్టీ అధినేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.
సీఎం ఏం చేస్తున్నారు ?
తన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. వైకాపా బాధితుల కష్టాలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతామని హామీ ఇచ్చారు.