వైకాపా నాయకులు, పోలీసులు తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కడప జిల్లా తెదేపా నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. దౌర్జన్యంగా అరెస్టు చేశారని ఆగ్రహించారు. వైకాపా నాయకుల ఒత్తిడితోనే రెడ్యం వెంకటసుబ్బారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని మండిపడ్డారు. వైకాపా నేతలు తప్పుడు ఫిర్యాదులు చేయడం సరికాదని, అలా చేసే వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఫిర్యాదుదారుడు కేసు ఉపసంహరించుకున్నట్లు ఎస్పీకి లిఖిత పూర్వకంగా తెలియజేసినా.. తెల్లవారుఝామున వందల మంది పోలీసులు మోహరించి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. తెదేపా నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు ఇకనైనా ఆపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
''అక్రమ కేసులు బనాయిస్తారా.. దౌర్జన్యంగా అరెస్టు చేస్తారా?'' - తెదేపా నేతలపై కేసుల వార్తలు
కడప జిల్లా తెదేపా నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అరెస్ట్‌ను పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. తమ పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు ఆపాలని డిమాండ్ చేశారు.
chandrababu-denies-kadapa-tdp-leader-venkatasubaradis-arrest
TAGGED:
తెదేపా నేతలపై కేసుల వార్తలు